Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్మగూడెం పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

వెల్మగూడెం పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిధిలోని వెల్మ గూడెం ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఉత్సవాన్ని సందడిగా మార్చారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలతో, నృత్యాలతో, ఆటలతో వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నెం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాంప్రదాయ పండుగలు విద్యార్థుల్లో మన సంస్కృతి, విలువలను పెంపొందిస్తాయి. బతుకమ్మ పండుగ మహిళా శక్తికి, ప్రకృతి పట్ల గల గౌరవానికి ప్రతీక” అని తెలిపారు.గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహమ్మద్ రహీం , నామిరెడ్డి ప్రశాంతి , ఉప్పునూతల వెంకయ్య మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోట్ల నారమ్మ, శివమ్మ,విద్యార్థులు, స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -