Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో నేటి నుండే బతుకమ్మ సంబరాలు

ఆలేరులో నేటి నుండే బతుకమ్మ సంబరాలు

- Advertisement -

– ఎంగిలి పువ్వుతో నేటి బతుకమ్మ ప్రారంభం 
– తీరొక్క పూలతో ఊరంతా జాతర
– బతుకమ్మ సంబరాల్లో ప్రభుత్వ విప్
– జనం టీవీ బహుమతులు
నవతెలంగాణ – అలేరు రూరల్

నేటి నుంచి ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఆడపడుచుల కోలాటాలు ఒకే రిథమ్ చప్పట్లతో తీరొక్క పూలతో బతకమ్మలు పేర్చి ఆనందోత్సవాల నడుమ ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి. జనం టీవీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన రామకృష్ణ విద్యాలయం ఆలేరులో జరిగే బతకమ్మ పోటీల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొననున్నారు. ఆడపడుచులతో పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను పరిశీలించి మొదటి బహుమతిగా పదివేల 116 రూపాయలు, రెండవ బహుమతి 5116రూపాయలు మూడో బహుమతి 3116 రూపాయలుతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి జనం టీవీ ఆధ్వర్యంలో ఇవ్వనున్నట్లు జనం టీవీ ఎడిటర్ దాసి శంకర్ ప్రకటించారు.

వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు రావాలని పిలుపు ఇచ్చారు. ప్రతి గ్రామంలో  వీధి వీధినా సంబరంగానే చేసుకునే బతుకమ్మ పండుగ ఆటపాటలతో ఆడపడుచులు ఆనందంతో తన సంతోషాన్ని ఇతరులకు పంచుకునే ఒక సామాజిక జీవన పండుగ బతుకమ్మ పండుగ.అమావాస్యతో పెత్రామవాస్య ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి.అలాగే పెద్దలకు బియ్యం ఇవ్వడం తెలంగాణలో ఆనవాయితీ.. ఇది అమావాస్య రోజు పెద్ద ఎత్తున చేపడతారు.ప్రపంచములో ఎక్కడ లేని పూల పండగ మన తెలంగాణ పూల జాతర బతుకమ్మలకు కూడా ప్రత్యేకత ఉంది.తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ ఏటా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతుంది.  తెలంగాణసంస్కృతిసాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతిగా నిలిచే ఈ తొమ్మిది రోజులు పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి ఆడి పాడతారు.

తీరొక్క పువ్వుతో బతుకమ్మ సంబరాలు..

బతుకమ్మ పండుగ ప్రధానంగా తంగేడు పూలు గునుగు గుమ్మడి మందార బంతి చామంతి అడవి చామంతి గోరింట బీర పువ్వులతో పేరుస్తుంటారు. ఈ ఏడు విస్తారంగావర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండడంతో ఎక్కడ చూసినా అడవి పూవులు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి. ఈ పూలతో బతుకమ్మను పేర్చి పసుపు ముద్దతో గౌరమ్మనుచేసి ప్రతి ఏటా భాద్రపద అమావాస్య మొదలు అశ్వయుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ప్రతి ఒక్క రోజు మహిళలు బతుకమ్మ ఆడి పాడి చెరువులో నిమజ్జనంచేయడం ద్వార చెరువులోని నీరు శుద్ధి జరిగి పశు పక్షాదులకు, పంటలకు మేలు చేస్తూ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి సద్దుల బతుకమ్మ చివరి రోజు పోయిరా బతుకమ్మ అంటూ నీటిలో వదిలి ఆడవాళ్లు అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు..ఈ తొమ్మిది రోజులపాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారు.

 ఆ పూలలో ఔషధగుణాలు..

బతుకమ్మను పేర్చందుకు చాలారకాల పూలను వినియోగిస్తారు. సహజ సిద్ధంగా అడవులలో పూసే పూలను అధికంగా వినియోగిస్తారు.ఇలా ఉపయో గించే పూలలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. పాత రోజుల్లో వర్షాకాలంలో కొత్తనీరు చేరువుల్లోకి చేరేది.ఆ నీటినే ప్రజలు నేరుగా తాగేవారు.నీరు కలుషితం కాకుండా ఉండేందుకు గాను ఔషధ గుణాలు కలిగిన పూలను అందులో వేసేవారు.అలా బతుకమ్మ పండుగకు కూడా పలురకాల పూలను వినియోగించేవారు.ఆ విధంగా బతుకమ్మ పండుగ ప్రజలను కాపాడే పండుగైంది.బతుకమ్మ లను నీటిలో వేయడం వల్ల పువ్వులు,కాడలు నీటి లో కలిసి పోతాయి.తద్వారా వాటిలోని ఔషధ గుణాల ప్రభావంతో నీటిలోని బాక్టీరియా చనిపో తుంది.నీరు కూడా సహజంగా శుద్ధి అవుతుందని నాటితరం పెద్దలు చెపుతున్నారు.

తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ పండుగ వాతావరణం..

       పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించాయి.దీంతో ప్రజలు ముఖ్యంగా ఆడబిడ్డలు పల్లెలకు ఊరు వెళతారు.దీంతో పల్లెల పండుగ వాతావరణం నెల కొననుంది.తెలంగాణ అంతట గ్రామ గ్రామాన వీధి వీధినా ఆటపాటలతో ఆడపడుచులు ఆనందంతో తన సంతోషాన్ని ఇతరులకు పంచుకుంటూ జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -