- Advertisement -
– మహిళలతో కలిసి ఆడిపాడిన గవర్నర్ దంపతులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం జరిగిన వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన సతీమణి సుధా దేవ్ వర్మతో కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందంగా పేర్చిన బతుకమ్మను ఆమె స్వయంగా తీసుకుని వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఆమె ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని కొనియాడారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు తెలంగాణ మహిళలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- Advertisement -