Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బతుకమ్మ వేడుకలు..

ఘనంగా బతుకమ్మ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని ఆవంచ, తిమ్మాజీపేట గ్రామాలలో వున్నా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో శనివారం దసరా సెలవుల సందర్భంగా బతుకమ్మ వేడుకలు, ఆనందోత్సాహాల మధ్య సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ విద్యార్థులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చారు. ప్రకృతి సంపదను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా బొడ్డెమ్మలతో నృత్యాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమృత మాట్లాడుతూ చిన్నారులకు పండగ ప్రాశస్త్యాన్ని వివరించారు. పాఠశాలల్లో ఇటువంటి విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల లోపల నైపుణ్యాభివృద్ధితో పాటు పాఠశాల అంటే ఆకట్టుకునేలా ఉంటుంది అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. అనంతరం అవంచ గ్రామ పరిధిలోని కెనాల్ లో విద్యార్థులతో కలిసి భాజా భజంత్రీల మధ్య అట్టహాసంగా బతుకమ్మ లను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -