నవతెలంగాణ – చండూర్
స్థానిక సంక్షేమ పాఠశాలలో శనివారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు ఉపాధ్యాయులు అందరూ కలిసి సేకరించిన రకాల పువ్వులతో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ ఆధ్వర్యంలో అద్భుతంగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కోడి వెంకన్న మాట్లాడుతూ తొమ్మిది రోజులు 9 రకాల నైవేద్యాలతో బతుకమ్మలను రకరకాల పువ్వులతో పేర్చి బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు నిర్వహిస్తారని వాటి యొక్క ప్రాముఖ్యతలను వివరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా విద్యార్థినులు నృత్య ప్రదర్శన ద్వారా అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ గారు, ప్రిన్సిపాల్ రవికాంత్, వినయ్, లతీఫ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సన్ షైన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES