Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, అధ్యాపకులు ఆధ్వర్యంలో విద్యార్థినిలు, అధ్యాపకునిలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కోలాహాలంగా మారింది. అధ్యాపకునీలు విద్యార్థినిలతో కలిసి రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మను పేర్చి బతుకమ్మను ఏర్పాటు చేశారు. గౌరమ్మ పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. గ్రామీణ జానపద పాటలతో తెలంగాణ యాస భాషలో ఆటలను పాడుతూ ఆనందంగా గడిపారు. బతుకమ్మకు నైవేద్యంగా   అనంతరం సద్దుల బతుకమ్మ సందర్భంగా విద్యార్థినిలు రుచికరమైన వంటకాలు తీసుకొని వచ్చి నైవేద్యంగా నుంచి అనంతరం ఒకరికి ఒకరు పంచుకోవడం జరిగింది.

రంగురంగుల పూలు, సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించిన పువ్వులతో బతుకమ్మను చేయడం వలన కళాశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉందని అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది. అనంతరం మండలంలోని మహిళా సోదరీమణులకు, ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బతుకమ్మ వేడుకల కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి,  అధ్యాపకులు రమేష్ , సాయిలు , కుమారస్వామి, బాలాజీ, నాగరాజ్, వలింధర్, సంతోష్, నాయక్, సత్యం, శ్రీధర్, రామచందర్, సౌజన్య, కళ్యాణి, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -