నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో నలంద పాఠశాల యందు ముందస్తు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మొదట బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి బతుకమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బతుకమ్మలను పాఠశాల మైదానంలో ఉంచి ఉపాధ్యాయుని విద్యార్థులు అందరూ కలిసి ఆటపాటలతో బతుకమ్మ నృత్యాలు చేయడం జరిగింది. పాఠశాల యజమాన్యం కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపాల్ సాగర్ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటారు బతుకమ్మ పేర్లను వాటి ప్రాముఖ్యతని విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. తదుపరి బతుకమ్మని ఊరేగింపుగా తీసుకొని చెరువు వద్ద నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.
నలందలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES