Saturday, September 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పాఠశాలల్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..

పాఠశాలల్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ ముందస్తుగా మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాల, కురుక్షేత్ర పాఠశాల, శ్రీ సరస్వతి శిశు మందిర్, శ్రీ వెంకటేశ్వర పాఠశాల తదితర పాఠశాలలోని విద్యార్థి విద్యార్థులు శనివారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినిలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పాఠశాల ఆట స్థలంలో బతుకమ్మ వృత్తాకారంలో బతుకమ్మ ఆటను ఆడి చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు మన తెలంగాణ రాష్ట్రం నిలయమైందన్నారు. రంగురంగుల పూలను దేవతగా కొలిచి పువ్వులనే బతుకమ్మగా పేర్చి గౌరమ్మను పెట్టి మన తెలంగాణలో దేవతగా కొలిచే బతుకమ్మ సంబరాలు నిర్వహించడం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుక్షేత్ర ప్రిన్సిపల్ నవీన్ కుమార్, సరస్వతీ శిశు మందిర్ ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, శ్రీ వెంకటేశ్వర స్కూల్ ప్రధానోపాధ్యాయులు నానక్ సింగ్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -