Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ చైతన్యలో బతుకమ్మ సంబరాలు..

శ్రీ చైతన్యలో బతుకమ్మ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ కరస్పాండెంట్ ధర పెళ్లి ప్రవీణ్ కుమార్ కార్యదర్శి ధర్పల్లి నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మన తెలంగాణ ఆత్మను ప్రతిబందించే గొప్ప పండుగని పేర్కొన్నారు బతుకమ్మ అనేది స్త్రీలు జరుపుకునే పూల పండుగ అని పేర్కొన్నారు. బతుకమ్మలో స్త్రీ శక్తి, సాంప్రదాయం, సంస్కృతి, తెలంగాణ గౌరవం ప్రతిబింబిస్తాయి అని అన్నారు. శ్రీ చైతన్య ప్రిన్సిపల్ అంబోజు మల్లేష్ మన తల్లులు పాడే బతుకమ్మ పాటలు మన చరిత్ర, మన సంస్కృతిని తరతరాలకి అందజేస్తున్నాయి. అందుకే ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం తెలంగాణ పండుగ ప్రకటించింది అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండల్ రెడ్డి, సంతోష్, మురళి, శైలేష్, పసల బాలరాజు, రఫీ,శ్రీకాంత్, దీపిక, హారికభవిత, అనూష, మమత, శ్రీలత పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -