నవతెలంగాణ వెబ్ డెస్క్: సెప్టెంబర్ 28న స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి బతుకమ్మ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అంతర్జాల వేదికగా పాల్గొని, ప్రవాస తెలంగాణ వాసులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. బెర్న్, జెనీవా, లౌసానే, జ్యూరిచ్ వంటి నగరాల నుండి వచ్చిన తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జర్మనీ నుంచీ మహిళలు ప్రత్యేకంగా ఈ వేడుకలకు వచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి వచ్చిన త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ కు చెందిన ప్రఖ్యాత నాట్య గురువు ఇందిరా పరాశరం నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలను ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులు బలరాజేసింగ్, కార్యదర్శి వెండిత కిరణ్, బావిగడ్డ బ్రహ్మానంద రెడ్డి పర్యవేక్షించారు.

