నవతెలంగాణ – కంఠేశ్వర్
లింగీ తాండలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కళ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు ఐద్వా కార్యదర్శి సుజాత తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హాజరై మాట్లాడుతూ.. జిల్లా వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడుదామని ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చారు. మహిళల హక్కులకై నిలబడదాం అంటూ ప్రతి ఒక్క మహిళ పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై, కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలపై, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇలా అనేక సమస్యలపైన నిరంతరం పోరాటాలు నిర్వహిద్దామన్నారు. నిరంతరం మహిళల కోసం అండగా ఉంటూ.. అలాగే బతుకమ్మ సంబరాలు, సంక్రాంతి సంబరాలలో కూడా మహిళల నైపుణ్యాన్ని గుర్తించాలన్నారు. వారికి ఉన్న టాలెంట్ ని బయటపెట్టేందుకు కృషి చేస్తోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగీ తాండవాసులు పాపవ్వ లక్ష్మి, అనిత, లక్ష్మి, మీరీబాయ్, నరసవ్వ, గంగమణి, సాయవ్వ, బూదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES