- Advertisement -
నేచరాజు పల్లి గ్రామ అంగన్వాడీ టీచర్లు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలోని అంగన్వాడి 2 ఎల్తూరి సునీత సెంటర్ లో బతుకమ్మ సంబరాలను ఆ గ్రామ అంగన్వాడి టీచర్లు ఎల్తూరి సునీత లీలావతి మై భూమి వనిత నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం అంగన్వాడి టీచర్లు కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలో లభ్యమయ్యే పౌష్టికాహారం గురించి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా లక్ష్మి గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -