Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు ఎస్వి గార్డెన్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు పాల్గొనాలని ఆహ్వాన పత్రికను ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కి అందజేశారు. బతుకమ్మ సంబరాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -