- Advertisement -
– పూలను, ప్రకృతినీ పూజించే సంస్కృతి మనది
– కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ బతుకమ్మ పండగ పూలని ప్రకృతిని పూజించి ఆరాధించే పండుగని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పేర్చి, పూజలు చేసి బతకమ్మ ఆట, పాటలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, సురేష్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -