- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని అయా గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగ సంబురాలు సోమవారం అంగరంగా వైభవంగా జరిగాయి. పూలతో రూపొందించిన బతుకమ్మతో ఆడపడుచులు ప్రత్యేక పాటలతో ఆడుతూ..పాడుతూ ఉత్సహంగా జరుపుకున్నారు.
గ్రామ పంచాయతీల ఘన ఏర్పాట్లు..
మండల పరిధిలోని అయా గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు గ్రామ పంచాయతీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆడపడుచులకు ఆనందంగా గడిపేందుకు డీజే,వెలుతుర్లు ఏర్పాటు చేశారు.
కోలాహాలంగా శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం..
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ అవరణం ఆడపడుచులతో కొలహాలంగా మారింది. మండల కేంద్రంలోని ఆడపడుచులు సద్దుల బతుకమ్మ పండుగను ఆనందోత్సాహంగా జరుపుకున్నారు.
- Advertisement -