నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా, సాంప్రదాయ, సౌందర్యానికి ప్రతి రూపంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ సందర్భంగా మంథని, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
తెలంగాణ అక్కాచెల్లెళ్లు భక్తి శ్రద్దలతో అలంకరించే బతుకమ్మలు కేవలం పూల సమాహారమే కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక జీవన సౌందర్యానికి సజీవ రూపమని పేర్కొన్నారు. బతుకమ్మ పూలతో ప్రకృతిని ఆరాధించడం, గౌరమ్మను సత్కరించడం, సోదరీమణులు కలసి పాడుతూ, ఆడుతూ జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయన్నారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వుకీ ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయని, తిరొక్క పూలతో ప్రకృతి మాతకు కృతజ్ఞత చాటే పండగ బతుకమ్మని కొనియాడారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటిని సంతోషాలతో నింపాలని, మన తెలంగాణ తల్లికి మరింత కీర్తి చేకూర్చాలని ఆకాంక్షించారు.
ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES