బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణలో మాజీ జస్టిస్ రాధ రాణి…
నవతెలంగాణ – బంజారా హిల్స్
కుల, మత, వర్గ, లింగ వివక్ష లేకుండా పది మంది కలసి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ జస్టిస్ రాధ రాణి అన్నారు. ప్రకృతికి మన అవసరం లేదు కానీ మనకు ప్రకృతి మన బ్రతుకు అని చెప్పారు. కళాకారులకు ఏపక్షం అనేది ఉండదు,వారి మాట పాట ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ, డప్పు చప్పుళ్ళతో గ్రామల్లో ప్రజలను ఏకం చేయడమే లక్ష్యం అన్నారు.
బహుజన బతుకమ్మ పండుగ జరుగుతుందని అరుణోదయ సంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన రాధారాణి,ప్రో”తిరుమలి,ప్రో”లక్ష్మీ, రచయత ఏ కే,ప్రభాకర్ లతో పాటు పలువురు పాల్గొని ఆదివారం బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్ లో పోస్టర్, సీడీ లనూ ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రకృతి ప్రజలా రక్షణ కోసమే అనే నినాదంతో ఈ నెల 20 న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆటా – పాట మాటలతో ప్రారంభమై అక్టోబర్ 3న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో ముగుస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఊరురా ప్రజలను చైతన్యం చేస్తూ,సాగుతోందని తెలిపారు. సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ నినదలతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. సేవ్ ల్యాండ్ సేవ్ సాండ్ తప్పకుండా చేస్తామన్నారు. ఈ పండగ ఆడబిడ్డల పండగగా పేరుగాంచి రాష్ట్ర పండగగా ప్రకటించారని అలాగే తంగేడు పువ్వు ,పక్షి పాలపిట్టగా ప్రకటించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాల రవి,సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, జోత్స్న, బద్రి, జర్నలిస్టు తొలివెలుగు రఘు, గాంధీలతో తదితరాలు పాల్గొన్నారు.