కాటారం బాలుర గిరిజన గురుకులంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల బాలుర కళాశాలలో ఈ రోజు ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తలిదండ్రులు పాల్గొని చాలా ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో కోలాహలంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన పూల పండుగ బతుకమ్మ.
“బతుకమ్మ” అంటే “జీవించే తల్లి” లేదా “జీవనానికి మూలమైన తల్లి”. ఆశ్వయుజ మాస శుక్ల పక్షం ప్రారంభమై దసరా పండుగ ముందు రోజు వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. స్త్రీలు, ముఖ్యంగా ఆడపిల్లలు, పసుపు రంగు చీరలు ధరించి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. గడ్డిపూలు, గుంజిపువ్వు, తంగేడు, బంతి, గున్నెపువ్వు మొదలైన రకాల పూలను వాడతారు. పూలను చక్రాకారంలో, పొరలుగా పేర్చి గోపురాకారంలో బతుకమ్మను తయారు చేస్తారు. స్త్రీల ఐక్యత, ఆడపిల్లల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రకృతితో అనుబంధం, పూల పూజ, తల్లి గౌరవం. కుటుంబ సుఖసమృద్ధి కోసం, అన్నదాతలైన రైతుల పంట బాగుండాలని ప్రార్థిస్తూ జరుపుకునే పండుగ అని కళాశాల ప్రిన్సిపాల్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ H రాజేందర్ ,వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య,Dy వార్డెన్ బలరాములు అధ్యాపకులు నాగమణి,స్వప్న,సంపత్, సంతోష్,కృష్ణమాచారి గోపాలకృష్ణ ఉపాధ్యాయులు నీలిమ,రజిత,పద్మ, రాజాబాపు, జక్కు వీరయ్య,రజనీకాంత్ pet శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.