Wednesday, September 17, 2025
E-PAPER
Homeసినిమాబతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌

- Advertisement -

తెలంగాణలోని యువ సజనశీలురకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ‘బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌’ పేరిట పోటీలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ది, సంక్షేమం (మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌), తెలంగాణ చరిత్ర, సంస్కతి, పండుగలు, కళారూపాలపై షార్ట్‌ ఫిలిమ్స్‌, పాటల పోటీలు ఉంటాయి. షార్ట్‌ ఫిలిమ్స్‌ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు. పోటీల్లో ఎంపికైన థీమ్స్‌కు ప్రథమ బహు మతిగా రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తతీయ బహుమతి రూ.1 లక్ష, కన్సోలేషన్‌ బహుమతి రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వడంతో పాటు విజేతలందరికీ ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం చేస్తారు. ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి, 4కె రిజల్యూషన్‌ కలిగి ఉండాలి. షార్ట్‌ ఫిల్మ్స్‌/ వీడియో సాంగ్స్‌ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్‌’ల పైనే ఉండాలి, మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు, బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ కోసమే చిత్రీకరించినవై ఉండాలి. నిర్దేశిత గడువులోగా వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపికలు పూర్తి చేస్తుంది. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు ఈనెల 30 అని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దిల్‌ రాజు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -