Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్ని కులాల బతుకమ్మలు ఒకే చోట పెట్టి ఆడాలి

అన్ని కులాల బతుకమ్మలు ఒకే చోట పెట్టి ఆడాలి

- Advertisement -

బతుకమ్మలో కుల వివక్షను పాటించే వారిపై చర్యలు తీసుకోవాలి
నేటి నుండి సమానత్వ బతుకమ్మ సంబరాలు : కేవీపీఎస్‌ మహిళా విభాగం పిలుపు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆడపడుచులు ఆడుకునే ప్రకృతి పండగ బతుకమ్మలో దళితుల బతుకమ్మను వేరుచేసి, కులాల వారీగా బతుకమ్మలు పెట్టుకునే పద్ధతిని విడనాడి అన్ని కులాల బతుకమ్మలు ఒకే చోట పెట్టి ఆడుకోవాలని కేవీపీఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లో కేవీపీఎస్‌ కార్యాలయంలో మహిళా విభాగం రాష్ట్ర సమావేశం పికిలి భాగ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మహిళా విభాగం నాయకురాళ్లు పి భాగ్య, వి నిహారిక, జి.లక్ష్మీ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి పరిస్థితుల్లో కూడా ఇంకా గ్రామాల్లో కులాల వారిగా బతకమ్మలాడటం శోచనీయమని తెలిపారు.

హిందువులంతా బంధువులేనని చెబుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ బతుకమ్మ పండుగలో జరుగుతున్న కుల వివక్షను ఎందుకు ప్రశ్నించర విమర్శించారు. వారికి హిందువుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా హిందువులందరి బతుకమ్మలు ఒకచోటే ఆడే విధంగా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. సాంస్కృతిక శాఖ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు, అన్ని కులాల బతుకమ్మలు ఒకే చోట ఆడుకోవడానికి ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో చదువుకున్న విద్యార్థి యువతరం అన్ని కులాలను బతుకమ్మలను ఒకే చోట పేర్చి కుల వివక్ష అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమానత్వ బతుకమ్మ సంబురాలు నేటి నుండి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు ఎం కృపాసాగర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర కార్యదర్శి బి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -