- Advertisement -
– ప్రజాభవన్‌లో వృద్ధులు, వికలాంగులకు రవాణా సౌకర్యం
– వాహనాన్ని ప్రారంభించిన చిన్నారెడ్డి, దివ్యదేవరాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం ప్రజావాణిలో అర్జీలు పెట్టుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం కోసం బ్యాటరీ వాహనాన్ని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్యదేవరాజన్ మంగళవారం ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ప్రజాభవన్ ప్రధాన ద్వారం నుంచి అర్జీలు స్వీకరించే కార్యాలయం వరకు వృద్ధులు, వికలాంగులను ఉచితంగా ఆ వాహనం ద్వారా తీసుకెళ్లనున్నారు.
- Advertisement -