- Advertisement -
నిజమే!
అడవిప్పుడు
ప్రకృతి సౌందర్యం కాదు
అనకొండ కార్పోరేట్లు
అడవిని కమ్మేస్తున్నాయి
నిధి నిక్షేపాలపై ఆశ
నక్కకు బొక్కలా…
గనులు ప్రాజెక్టులు
టూరిజం సరిపోలా…
ఇప్పుడిక సైనికాయుధం
బిడ్డలుంటే అడవిదక్కదుగా
అందుకే బరితెగింపు
అడవులు
పర్యావరణం యదలు
మనుగడ కోసం
అమ్మలాంటి అడవికోసం
అనివార్య పోరాటం
అందుకే
అడవిప్పుడు
రొమాంటిజం కాదు
అందరం కలిసి పోరాడాల్సిన
ఒకానొక యుద్ధ భూమి.
-కె.శాంతారావు,
9959745723
- Advertisement -