No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజిల్లాలుజూన్ 1న బట్టుపల్లి శ్రీనివాస్ 14వ వర్ధంతి ..

జూన్ 1న బట్టుపల్లి శ్రీనివాస్ 14వ వర్ధంతి ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : సీపీఐ(ఎం) నాయకులు అమరజీవి బట్టుపల్లి శ్రీనివాస్ ఆశయాలను సాధిద్దామని పట్టణ కార్యదర్శి బాలకృష్ణ తెలిపారు. ఆదివారం పట్టణ కమిటీ సమావేశం నాయకులు గంధ మల్ల మాతయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  జూన్ 1 బట్టుపల్లి శ్రీనివాస్ 14వ వర్ధంతి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాట ప్రతినిధిగా బట్టుపల్లి శ్రీనివాస్ ముందుండే వారిని తెలిపారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు కోసం, మౌలిక సదుపాయాల కోసం నిర్వహించిన పలు పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. అతను మృతి చెంది 14 సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ప్రజలు మరవకుండా గుర్తుచేసుకుంటున్న విషయాన్ని తెలిపారు. పట్టణంలోని సింగన్నగూడెం చౌరస్తాలో స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు పార్టీ శ్రేణులు పార్టీ లకు అతీతంగా శ్రేయోభిలాషులు వర్ధంతిని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో పట్టణ కార్యవర్గ సభ్యులు బందెల  ఎల్లయ్య, కల్లూరి నాగమణి, పట్టణ కమిటీ సభ్యులు వల్లాస్ అంజయ్య, బర్ల వెంకటేష్  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad