Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా బావండ్లపల్లి

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా బావండ్లపల్లి

- Advertisement -

నవతెలంగాణ- రామన్నపేట
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గీత కార్మిక సంఘం నాయకులు భావండ్లపల్లి బాలరాజు ను ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఎమ్ ఎస్ రెడ్డి గార్డెన్ లో రాయి కృష్ణయ్య, మద్యల రాజయ్య, ధూపటి వెంకటేష్ ల అధ్యక్షతన నిర్వహించిన కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ల సమక్షంలో జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో బాలరాజు మాట్లాడుతూ అనేక కుటుంబాలు గీత వృత్తినే ఆధారం గా జీవనం సాగిస్తున్నాయని, ఆ వృత్తిని ఆధునికీకరించి, నీరా, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, యువతి, యువకులకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. గీత వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం వృత్తిదారులను సమీకరించి కృషి చేస్తానన్నారు. ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి అయిన కృతజ్ఞత తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -