నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్లో శనివారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ఆదేశాల మేరకు ఆర్టిఐ బిబిపేట మండల శాఖ ఆధ్వర్యంలో, బిబిపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొండ విజయ్ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై కొండ విజయ్ మాట్లాడుతూ.. ఆర్.టి.ఐ చట్టం ప్రజలందరికీ ఒక వరం లాంటిదని, ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించుకుని, తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చునని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బిబిపేట (ఆర్టిఐ) మండల అధ్యక్షులు, నిస్వార్థ సమాజ సేవ జాతీయ అవార్డు గ్రహీత, ఏం.నాంపల్లి మాట్లాడుతూ.. ఆర్టిఐ చట్టం సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిదని, గ్రామపంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు, తగు సమాచారాన్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చునని సూచించారు. ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించాలని, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ.సుబ్రహ్మణ్యం, పిసి. రాజయ్య, మహిళా పిసీలు, స్వప్న,రచన, ఆర్ టి ఐ మండల కార్యదర్శి పండ్ల హనుమంతు, రచయిత నంది అవార్డు గ్రహీత, నీలకంఠంతో పాటు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



