Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీల చైతన్య సదస్సు విజయవంతం 

బీసీల చైతన్య సదస్సు విజయవంతం 

- Advertisement -

నవతెలంగాణ – జోగులంబ గద్వాల
బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ను సాధించడానికి గద్వాల నుండే ఉద్యమ ప్రారంభం అయిందని రాష్ట్ర వక్తలు పేర్కొన్నారు. రిజర్వేషన్ సాధనకై రాష్ట్ర బిసి జేఏసీ, బహుజన ఉద్యమాలతో కలిసి పని చేస్తామని తీర్మానించారు. ఈ సదస్సులో జిల్లా వ్యాప్తంగా బిసి లు, బహుజన ఉద్యమ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొని రావాలని ప్రతినబునారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బహుజన విద్యావేత్త అక్కల బాబు గౌడ్, బిసి చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సదస్సుకు ముఖ్య కార్య నిర్వాహకులు,  బహుజన ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ నాగర్ దొడ్డి వెంకట్రాములు, జేఏసీ మధుసూదన్ బాబు, అవాజ్ కమిటీ అతికూర్ రహిమాన్, బహుజన రాజ్య సమితి వాల్మీకి, వినోద్ కుమార్, టిఆర్ఎస్వి కుర్వ పల్లయ్య, శంకర ప్రభాకర్, కృష్ణయ్య, రహిమతుల్లా,అచ్చన్న గౌడ్,  నాగన్న, కిరణ్,చాకలి ఆంజనేయులు, ఐజ వీరేష్, తదితరులు తమ కార్యాచరణను వివరించారు. జేఏసీ నాయకుడు మధుసూదన్ బాబు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో  వక్తలు ఆధిపత్య అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రవర్ణ నాయకుల కుట్రలను, తప్పులను ఎత్తి చూపారు. రాజ్యాంగంలో 10 శాతం  ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ లను అమలు చేసిన నాయకులు బిసి రిజర్వేషన్ లను ఎందుకు అడ్డుకొంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి రిజర్వేషన్ ల ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలను ఆర్థికంగా ఆదుకోలేని అగ్రవర్ణ ఆధిపత్య పెట్టుబడిదారీ ఆర్థిక దోపిడి పాలకులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ లతో ఎప్పుడో శాతం లిమిట్ కూడా దాటిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర అగ్రవర్ణ పాలకులు తాము హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చి, రాష్ట్రపతి ఆమోదంతో గ్యారంటీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే అగ్రవర్ణ పాలకులను ఓటు ఆయుధము ద్వారా రాజకీయ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.

ప్రపంచంలో 60 శాతం బిసి లు అంటే 140 కోట్ల జనాభాలో దాదాపు 84 కోట్ల మందిని మోసం చేసే ఆధిపత్య పార్టీలు మన దేశంలోనే కొనసాగడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.ఎన్నో వేల సంవత్సరాలుగా ఆధిపత్య కులాల అణచివేతకు, సామాజిక అన్యాయానికి గురి అయిన బిసి లు (శూద్ర కులాలు) రాజ్యాంగ ప్రకారం సమానత్వం ను సాధించడానికి అంబేద్కర్ లాంటి బహుజన మేధావులు, రాజ్యాంగ ప్రధాతలు  రిజర్వేషన్ లను అమలు చేస్తే దాన్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా అడ్డుకోవడం సిగ్గుచేటు అని నిందించారు.జనాభా మేరకు రిజర్వేషన్ లను, అవకాశాలను కల్పించకపోతే అగ్రవర్ణ పాలకుల ఇళ్లను ముట్టడించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందని హిచ్చరించారు.1931 సంవత్సరం లో బిసి ల కుల గణన ను మళ్ళీ ఇప్పటిదాకా చేపట్టకపోగా, బిపి మండల్ కమీషన్ సిఫార్సులను కూడా తుంగలో త్రోక్కారు.కనుక దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి, అన్ని పార్టీలు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ లను అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి.లేదంటే మా ఉద్యమాలు తప్పవు. ఈ కార్యక్రమం లో సిపిఐ ఆంజనేయులు, సిపిఎం ఉప్పేరు నర్సింహ, బిఎస్పి రాంబాబు, భీమ్ ఆర్మీ బుడకల ప్రకాష్, మేడికొండ ఈశ్వర్, బుచ్చన్న, కృష్ణారెడ్డి, గోపాల్ యాదవ్,కోళ్ల హుస్సేన్, కృష్ణ, వీరేష్, స్వామిదాసు, గంజిపేట రాజు,ఆటో మక్ బూల్, దానయ్య, నాగిరెడ్డి, తాహేర్, రంగు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -