నవతెలంగాణ – వలిగొండ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర వ్యాప్త బంద్ లో బాగంగా మండలకేంద్రంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీ, సీపీఐ పార్టీ, బీఎస్పీ పార్టీ, టీడీపీ పార్టీ, పార్టీ ల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు పై ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భముగా పలువురు మాట్లాడుతూ బీసీ లకు 42% రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం లోక సభలో తీర్మానం చేసి చట్ట బద్దత కల్పించి వెంటనే రిజర్వేషన్లు అమలుపర్చి స్థానిక సంస్థల ఎన్నికలునిర్వహించాలని కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని మెయిన్ రోడ్డుపై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.ఈ సందర్భముగా రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ లో బాగంగా రాస్తా రోకో నిర్వహించి పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, చట్ట బద్దత లేని బీసీ లకు 42% రిజర్వేషన్లకై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రిజర్వేషన్లు అమలుపర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మెయిన్ రోడ్డుపై రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ లో బాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భముగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లలో బీసీ లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి నిర్వహిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు.