- Advertisement -
- – బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం
– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ
నవతెలంగాణ – పాలకుర్తి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి కేంద్రం ఆమోదింప చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు శనివారం చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు బందును పాటించాయి. బీసీ బంద్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ పంపించిందని తెలిపారు. 42% బిసి రిజర్వేషన్ అమలు కాకుండా బిజెపి అడ్డుకుంటుందని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తుందని స్పష్టం చేశారు. బీసీ సంఘాలన్నీ ఐక్యమత్యంతో కేంద్రంపై పోరాటం చేసి 42 శాతం రిజర్వేషన్ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి,బీసీ సంఘాల నాయకులు గిరగాని కుమారస్వామి గౌడ్, చిలువేరు కృష్ణమూర్తి, బొమ్మగాని భాస్కర్ గౌడ్, మొలుగూరి యాకయ్య గౌడ్, నలమాస రమేష్ గౌడ్, ఏలూరి యాకన్న, చిట్యాల శ్వేత, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు, మూల వెంకటేశ్వర్లు గౌడ్, శైలేంద్ర శ్రీనివాస్, సంఘీ వెంకన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -