Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ సంఘాలు ఏకం కావాలి 

42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ సంఘాలు ఏకం కావాలి 

- Advertisement -

వి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యాకయ్య గౌడ్
నవతెలంగాణ – పాలకుర్తి 

బీసీ రాజ్యాధికారం కోసం, 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి 42 శాతం రిజర్వేషన్లను సాధించుకోవాలని వి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొలుగూరి యాకయ్య గౌడ్ బీసీ సంఘాల నాయకులకు, బీసీ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పాలకుర్తిలో యాకయ్య గౌడ్ మాట్లాడుతూ ..బీసీ రిజర్వేషన్ల అమలు అమలుపై హైకోర్టు బీసీలు నిరాశ పడే తూర్పు ఇవ్వడం బీసీ సమాజాన్ని అవమానపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపెతమైన నిర్ణయమని అన్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీల పక్షపాతిగా పనిచేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తే రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.బీసీలకు అండగా ఉండవలసిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. బీసీలు 42 శాతం రిజర్వేషన్ సాధించుకునేందుకు పార్టీలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు బీసీల ముసుగులోనే బీసీలకు మోసం చేస్తున్నాయని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -