Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అమరవీరులకు నివాళులర్పించిన బీసీ సంఘం నాయకులు 

అమరవీరులకు నివాళులర్పించిన బీసీ సంఘం నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వినాయక్నగర్లో గల అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు సాధించుకున్న తెలంగాణ ఎంతోమంది త్యాగధనుల త్యాగాల ఫలితమే అని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన మహనీయుల బాటలో సాగి బంగారు తెలంగాణ నిర్మాణంలో బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు. కానిస్టేబుల్ కిష్టయ్య నుండి కాసోజు శ్రీకాంత చారి వరకు బహుజన బిడ్డలు తెలంగాణ సాధనలో ముందుండడం ఒక గర్వకారణమని ఈ విధంగా ఈ సందర్భంలో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, మాడవేడి వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, శ్రీలత, విజయ్ బగ్గలి అజయ్, గంగాధర్, సాయి బసవ, సురేందర్, హనుమాండ్లు, సదానంద, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad