Sunday, October 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎంజీబీఎస్‌ వద్ద బీసీ జేఏసీ ధూంధాం

ఎంజీబీఎస్‌ వద్ద బీసీ జేఏసీ ధూంధాం

- Advertisement -

12 గంటల పాటు బైటాయించిన బీసీ శ్రేణులు
పాల్గొన్న జాజుల శ్రీనివాస్‌
మద్దతుగా మహేశ్‌ గౌడ్‌, మందకృష్ణ, నెల్లికంటి సత్యం హాజరు
తెలంగాణ బీజేపీ పెద్దలు ప్రధానిని ఒప్పించే బాధ్యత తీసుకోవాలి : మందకృష్ణ


నవతెలంగాణ- ధూల్‌పేట
రాజ్యాంగ సవరణ ద్వారా బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బీసీ రిజర్వేషన్లను యధావిధిగా అమలు చేయాలని ప్రధాన డిమాండ్‌తో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుండి పట్టణం వరకు సకలం బంద్‌ జరిగినట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం తెల్ల వారుజామున నాలుగు గంటల నుంచి ఎంజీబీఎస్‌ బస్‌ స్టేషన్‌ వద్ద వందల మంది బీసీ శ్రేణులు 12 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఆందోళన సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, బీసీ కళా కారుల ఉద్యమ గీతాలతో ఆటపాటలతో ధూం ధాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తొమ్మిదవ షెడ్యూల్లో రిజర్వేషన్లను చేర్చి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని జాజుల డిమాండ్‌ చేశారు.

పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి మైలేజీ వస్తుందని బీజేపీ అనుకుంటే ఆ పార్టీనే చొరవ తీసుకోవాలన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచడానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు చిత్తశుద్ధితో వ్యవహ రించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంపై ఇంకా ఒత్తిడి పెంచా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణలోని బీజేపీ పెద్దలు బీసీ రిజర్వేషన్ల విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లాడుతూ బీసీల్లో ఆగ్రహ జ్వాలలు రగలకముందే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -