– బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతే ఎన్నికలు జరపాలి
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రానికి విచ్చేసిన పంచాయతీ రాజ్ శాఖ,జిల్లా ఇంచార్జీ మంత్రికి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు మాకు వద్దు, బిసి లకు చట్టబద్ధంగా, రాజ్యాంగ సవరణ ద్వారా 9వ్ షెడ్యూల్ లో చేర్చిన తరవాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోరారు. డిసెంబరు లో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోపు రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి చట్టబద్ధంగా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని, బీసీ రిజర్వేషన్లు దామాషా ప్రకారం ఉండేలా చూడాలనే మాట నిలబెట్టుకోవాలన్నారు. కేంద్ర ప్రబుత్వం పై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్, కొత్తపల్లి మల్లన్న,రాజేందర్, వినోద్ నాయక్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన బీసీ జేఏసీ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



