చైర్మెన్‌గా ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మెన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ – బంజారాహిల్స్
బీసీ రిజర్వేషన్స్ సాధన కోసం బీసీ సంఘాలు ఐక్య కార్యాచరణ జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ చైర్మెన్‌గా ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మెన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికయ్యారు. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి రిజర్వేషన్లపై ముందుకెళ్తామని ఎంపీ, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మెన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హౌటల్‌లో బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు బీసీ ఐక్యకార్యాచరణ జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతం బీసీలు, 5శాతం రెడ్లు ఉన్నారనేది నగ్న సత్యమన్నారు.
60 శాతం జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయడంలో కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు. పార్టీలకతీతంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ఒక్కటయ్యామని స్పష్టం చేశారు. తెలంగాణలోని రెడ్ల ఆధిపత్యాన్ని పాతరేసేందుకే బీసీ జేఏసీ ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేసే దాకా బీసీ జేఏసీ పని చేస్తుందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 18న బంద్‌కు పిలుపునిచ్చామని, బంద్‌కు అన్ని కుల సంఘాలు, విద్యా, వ్యాపార సంస్థలు, ఆర్టీసీ సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతివ్వాలన్నారు. ఆరోజు బీసీలకు దోస్తులెవరో, ద్రోహులెవరో తేటతెల్లమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మందార గణేష్ చారి, బుజ్జ కృష్ణ, దాసు సురేష్, రాజారామ్ యాదవ్, వెంకట్, ఇతర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
బీసీ ఐక్య కార్యాచరణ జేఏసీ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES