Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాజిక విప్లవానికి నాంది బిసి రిజర్వేషన్లు

సామాజిక విప్లవానికి నాంది బిసి రిజర్వేషన్లు

- Advertisement -

 తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా
నవతెలంగాణ – వనపర్తి 
: ఎన్నో ఉద్యమాల తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినేషన్ తెలంగాణ జన సమితి పార్టీ స్వాగతిస్తోందని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుటకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు తెలంగాణ జన సమితి చేసిన పోరాటాలు ప్రయత్నాల మూలంగా ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే ఆర్డినెన్స్ సాధించుకోగలిగామన్నారు. ఇది ప్రజా విజయమని తెలంగాణ జన సమితి అభిప్రాయపడుతుందన్నారు.

తెలంగాణ సాధించుకుంటే రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అడుగులు పడతాయని జయశంకర్ ఆనాడు తాను ముచ్చట్లో చెప్పినట్టుగానే ఈరోజు అడుగుల దిశ మొదలైందని మేం భావిస్తున్నామన్నారు. గత పది ఏళ్ల కాలంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి టిఆర్ఎస్ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిందని, 32 శాతం రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గించి బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసిందన్నారు. ఈ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాహసోపేతమైన దన్నారు. ఈ సాహసోపేత నిర్ణయాన్ని తెలంగాణ జన సమితి అభినందిస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా అమలులోకి తీసుకురావాలని తెలంగాణ జన సమితి పార్టీ కోరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కె.అనిల్, ఎస్.వి.యూసోఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -