Thursday, January 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీసీ రిజర్వేషన్లు ఖరారు

బీసీ రిజర్వేషన్లు ఖరారు

- Advertisement -

117 మున్సిపాలిటీల్లో 26 మున్సిపాలిటీలకు..
ఆరు కార్పొరేషన్లలో మూడు కార్పొరేషన్లకు రిజర్వ్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌

మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు సహా పట్టణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు పట్టణాభివద్ధి శాఖ 2011 జనాభా లెక్కలను తీసుకుంది. 123 యూఎల్‌బీలకు ఎన్నికలు జరగనుండగా 117 మున్సిపాలిటీలలో 26 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు బీసీలకు రిజర్వ్‌ చేయబడ్డాయి. యూఎల్‌బీలలో వార్డులకు రిజర్వేషన్లను ఆ శాఖ బుధవారం ముగించింది. అయితే జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సి’పోల్స్‌’ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తును ప్రారంభించింది. కమిషన్‌ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -