Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బంద్ బంద్ ఫర్ జస్టీస్ కు సహకరించాలి 

బీసీ బంద్ బంద్ ఫర్ జస్టీస్ కు సహకరించాలి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదల్చిన 42 శాతం రిజర్వేషన్లను కొందరు అగ్రవర్ణాల వారు కోర్టులో కేసి వేసి నిలిపివేయడంతో ఈనెల రాష్ట్ర బంద్ కు బీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ లు బందుకు పిలుపునిచ్చారు. ఈ బంద్ బంద్ ఫర్ జస్టిస్ కు సహకరించమని నిజామాబాదులోని పలు సంస్థలను కలుసి వారి సహకారం కోరడం జరిగింది. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ పలు వ్యాపార సంస్థల అసోసియేషన్లను కలవడం జరిగింది. ఇందులో బంగారు వర్తక సంఘం వారిని, దాల్ మార్చంట్ సంఘం వారిని, కుమార్ గల్లి షాప్స్ అసోసియేషన్ వారి,ని కిరాణా షాపుల అసోసియేషన్ వారిని కలిసి వారి సహకారం కోరడం జరిగింది. 

ఈ పోరాటం న్యాయ పోరాటమని… దీనికి అన్ని వర్గాల వారు సహకరించాలని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్ని వర్తక సంఘాల అధ్యక్ష కార్యదర్శులను కలిసి విన్నపం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, బగ్గలి అజయ్, కోడూరు స్వామి విజయ్, బాలన్న చైతన్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -