రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడం రవీందర్
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలో బీసీ వర్గాలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించనీ వైఖరిని నిరసిస్తూ జీవో 9 ఆర్డినెన్సుపై రాష్ట్ర హైకోర్ట్ స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రలోని బీసీ సంఘాలు ఐక్యంగా ఈనెల18న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు తుడుందెబ్బ సంపూర్ణ మద్దతు ఇస్తోందని తుడుందేబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం రవిందర్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు.
భారత దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతల కారణంగా 1952లో రాజ్యాంగ నిర్మాణ కర్తలు రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిచారని, ఈ మేరకు ఆయా వర్గాలకు సాంఘిక ఉపశమనం కొంత కలిగిందన్నారు. ఉద్యోగ, విద్య, రాజకీయ పదవులలో కొంత భాగం లభించిందని, దానితో సామాజిక పొందికలో కొంత భాగం అయ్యారని తెలిపారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందులోని మరింత వెనకనున్న వారికి సామాజిక న్యాయం జరగాలని, దానికి ఆయా జనాభా ప్రాతిపదికగా వర్గీకరణ జరగాలన్నారు. ఈ నేపథ్యంలో 42 శాతం రాజకీయ రిజర్వేషన్ కోసం బీసీ వర్గాలు ఐక్యంగా చేస్తున్న కార్యక్రమాలను తుడుందెబ్బ క్రియాశీలంగా బలపరుస్తుందన్నారు.
బీసీ రాష్ర్ట బందుకు తుడుందెబ్బ సంపూర్ణ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES