నవతెలంగాణ- కంఠేశ్వర్
ఇటీవలే పాత నేరస్తుడి దాడిలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కు స్థానిక ఎల్లమ్మ గుట్టలోని సాయిధ పోరాట అమరవీరుల స్థూపం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం నివాళులు అర్పించారు. కానిస్టేబుల్ ప్రమోద్ తన వీధిలో ఎప్పుడు చురుకుగా ఉండేవాడని, సంఘ వ్యతిరేకుల పాలిట సింహ స్వప్నంగా ఉండేవాడని, నేరస్తుల ఆచూకీ తెలిస్తే వాళ్లను పట్టుకునే వరకు విశ్రమించేవాడు కాదని గుర్తు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తో పాటు బుస్సా ఆంజనేయులు, కరిపే రవీందర్, కొయ్యాడ శంకర్, మాడవేడి వినోద్, బగ్గలి అజయ్, శ్రీలత, విజయ్, చంద్రకాంత్, బసవసాయి, చంద్రమోహన్, నరసయ్య వాసంజయ, ఓంకార్, మురళి కైరం కొండ బాబు తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ కు నివాళులు అర్పించిన బిసి సంక్షేమ సంఘం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES