ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధం
నవతెలంగాణ – ముంబయి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025 సాధారణ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో రానున్న మూడేండ్లకు ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నారు. ఒక పదవికి ఒక నామినేషనే రావటంతో ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా ఆఫీస్ బేరర్లు ఎన్నిక కానున్నారు. అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శిగా ప్రభుతేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భాట్ లాంఛనంగా ఎన్నిక కానున్నారు. అపెక్స్ కౌన్సిల్‌కు జైదేవ్ నిరంజన్ షా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు అరుణ్ సింగ్ ధుమాల్, కైరుల్ జమాల్ మజుందార్‌లను ఎన్నుకోనున్నారు.
నేడు బీసీసీఐ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -