Sunday, December 28, 2025
E-PAPER
Homeఆటలుగంభీర్‌ను తొలగించే అంశంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

గంభీర్‌ను తొలగించే అంశంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను మార్చబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెరదించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ నిరాధారమైన పుకార్లేనని స్పష్టం చేసింది. గంభీర్ కోచ్‌గా కొనసాగుతారని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పింది. టీమిండియా ఇటీవల టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో హెడ్ కోచ్‌గా గంభీర్‌ను టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్‌తో బోర్డు చర్చలు జరుపుతోందని కూడా కథనాలు వెలువడ్డాయి.

ఈ పుకార్లపై బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. “గౌతమ్ గంభీర్‌ను మారుస్తారనే వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇప్పటివరకు అలాంటి చర్చలే జరగలేదు. గంభీర్‌తో మా కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఉంది. కోచింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆయనపై మాకు పూర్తి నమ్మకముంది. ఇలాంటి కల్పిత వార్తలు ఎలా పుడతాయో అర్థం కావడం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు తోచిన విధంగా ఆలోచనలు చేస్తుంటారని, కానీ బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సైకియా పేర్కొన్నారు. బీసీసీఐ తాజా ప్రకటనతో గంభీర్ హెడ్ కోచ్ పదవిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -