హైదరాబాద్: మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్‌లో గ్లోబల్ లీడర్ అయిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోన్నట్లు ప్రకటించింది.. ఈ వ్యూహాత్మక విస్తరణ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తర్వాత భారతదేశంలో తమ కార్యాలయాన్ని సూచిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న తన క్లయింట్ బేస్ అవసరాలను తీర్చనుందని తెలిపింది.భారతదేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని బీసీజీ ఇండియా ఎండి, పార్టనర్ వికాశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఫార్మా ఉత్పత్తులలో మూడింటిలో ఒక వంతు, ఎగుమతులలో ఐదింటిలో ఒక్క వాటా కలిగి ఉందన్నారు. తెలంగాణ జీ ఎస్ డీపీ లో తయారీ రంగం 19.5 శాతం వాటా కలిగి ఉందన్నారు. ఇది జాతీయ సగటు 17.7 శాతం కంటే ఎక్కువన్నారు. ”హైదరాబాద్ పరిశ్రమ బలం, ఆవిష్కరణ, ఆశయం, ప్రతిభల సమ్మేళనం. ఇది భారత ఆర్థిక వద్ధికి శక్తి కేంద్రం. మా కొత్త కార్యాలయం క్లయింట్‌లకు దగ్గరై, వారి పరివర్తన ప్రయాణాలకు మద్దతు ఇస్తుంది,” అన్నారు.
హైదరాబాద్ లో బీసీజీ కొత్త సెంటర్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES