– జేఏసీ మండల కన్వీనర్ పాతాకుల వెంకటేశం యాదవ్
నవతెలంగాణ- తొగుట
బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ మండల కన్వీనర్ పాతాకుల వెంకటేశం యాదవ్ అన్నారు. గురువారం తొగుట మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కలిపించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేసారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి సమావేశంలో బిసి డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు. కానీ దానికి అనుగుణంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాన్నారు. అలాగే 18 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులకు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో బీసీలకి 42% బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టె విదంగా పార్లమెంట్ లో మాట్లాడాలని వినతిపత్రం ఇచ్చి వారిని కోరానునట్టు తెలిపారు.త్వరలోనే అఖిల పక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మండల కోకన్వీనర్ అకార సత్తయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులు సిరివేని గోవర్ధన్, చిక్కుడు చంద్రం ముదిరాజ్, చిప్ప నర్సింలు, కురుమ యాదగిరి, గొడుగు ఐలయ్య, కొంగరి నర్సింలు, భాస్కర్, రమేష్, రాజం, ప్రసాద్, కుల సంఘాల నాయకులు తదితరులు పాలుగోన్నారు.



