సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే బడ్జెట్‌లో బీసీలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ మురళి మనోహర్,డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాస్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దేవళ్ల సమ్మయ్య, టీపీసీసీ ఓబీసీ కన్వీనర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ పాల్గొన్నారు. బీసీ సబ్ ప్లాన్‌లో అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించడంతోపాటు బీసీ కులవృత్తుల ఉపాధి కోసం బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్‌లో బీసీలకు ప్రాధాన్యతనివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



