బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : బీసీలకు ధమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు భగ్గిలి అజయ్ అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలో అందరికీ దమాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు అదే విధంగా అగ్రకుల నిరుపేదలకు కూడా వాళ్లెంతో వాళ్లకు అంత వాటా ఇచ్చి రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది మాత్రం బీసీలకే. 56% ఉన్న బీసీలకు ఇంకా 27% రిజర్వేషన్లనే కొనసాగించడం అన్యాయం. మొన్న తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయడాన్ని స్వాగతించాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తానని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏది అయితే 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిందో దానిని వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అని బగ్గలి అజయ్ అన్నారు. ఈ రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా ఉండాలి అని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోయ్యాడ శంకర్ అన్నారు. 130 కులాల బీసీల్లో ఇంకా నిరుపేద రేఖకు కింద దాదాపు వంద కులాలు ఉన్నాయి. వారు అభివృద్ధి చెందాలంటే ఏదైతే రాష్ట్రప్రభుత్వం 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందో దానిని కేంద్రం కూడా వెంటనే బిల్ పాస్ చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు ఇవ్వాలనుకున్న రుణాలను కూడా తొందరగా ఇవ్వాలి. అందులో కూడా బీసీలకు 42 శాతం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్, కొయ్యాడ శంకర్, విజయ్ బసవ సాయి, మురళి తదితరులు పాల్గొన్నారు
బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES