– దేశంలో కులగణన జరిపి తీరాల్సిందే, బీసీ రిజర్వేషన్లను పెంచాల్సిందే..
– బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు
నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ దేశ వ్యాప్త జనగణలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల మాదిరిగానే బీసీల కుటుంబాలులెక్కించాలన్నారు.
బీసీ కులగణన పై పార్లమెంటులో ప్రత్యేక చర్చ పెట్టాలి. కులగణనలో బీసీలను విస్మరిస్తే కేంద్రానికి బుద్ధి చెపుతామన్నారు. బీసీల సుదీర్ఘ పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణ లో సమగ్ర కులగణన చేపడతామని గత సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారని,రేపు రాబోయే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా జనగణన లో భాగంగా కుటుంబాల లెక్కింపు చేస్తూ, బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించకపోవడం దారుణమైన అన్యాయమని అన్నారు. బీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి కొర్రీలు పెడుతూ, అయిష్టంగా వ్యహరించిందని, దేశవ్యాప్తంగా బీసీలలో వచ్చిన చైతన్యం తప్పని పరిస్థితుల్లో కుల గణన చేస్తామని ప్రకటించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతి జన గణనను రెండు దఫాలుగా చేపట్టాలని నిర్ణయించి, మొదటి దఫాలో కుటుంబాలను లెక్కించాలని 33 ప్రశ్నలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, అందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను లెక్కించి బీసీ కుటుంబాలను లెక్కించక పోవడమేమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పై బీసీలకు అనుమానాలు ఉన్నాయానీ,బీసీల అనుమానాలను నివృత్తి చేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కులగణన పై ప్రత్యేకంగా చర్చించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పోరాడడానికి దేశవ్యాప్తంగా బీసీ కులగన చేస్తామని విధాన నిర్ణయం ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మాట తప్పి వ్యవహరిస్తుందని విమర్శించారు. బీసీ ప్రధాని ఉన్న బీసీలకు అన్యాయం జరగడం శోచనీయం అని,కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం, మహిళా బిల్లులు బీసీ మహిళలకు సబ్ కోట కల్పించకపోవడం,కొత్త సవాళ్లు బీసీలకు రిజర్వేషన్లు పెట్టకపోవడం చాలా అన్యాయమని అన్నారు. బీసీ కుటుంబాల లెక్కింపు తదనంతరం కులగన లెక్కింపు తర్వాత జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, బీసీల వాటా బీసీలకు దక్కే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్, రాము పాల్గొన్నారు.



