Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహయ్యర్‌ పెన్షన్‌ కోసం బీడీఎల్‌ కార్మికులు ఉద్యమించాలి

హయ్యర్‌ పెన్షన్‌ కోసం బీడీఎల్‌ కార్మికులు ఉద్యమించాలి

- Advertisement -

బీడీఈయూ(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హయ్యర్‌ పెన్షన్‌ కోసం బీడీఎల్‌, బీఈఎల్‌, ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీడీఈయూ(సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీడీఎల్‌ వద్ద నిరసన కార్యక్రమంలో చేపట్టారు. అందులో బీడీఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళి, సత్తయ్య, కోశాధికారి ఎం. రవీందర్‌, డి.రవికుమార్‌, కృష్ణారెడ్డి, జేడీ.మల్లేష్‌, వినోద్‌ సింగ్‌, కిరణ్‌ కిషోర్‌ యాదవ్‌, శ్రావణ్‌ తదితర ఆఫీస్‌ బేరర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్‌ సంస్కరణలతో ప్రభుత్వరంగ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. హయ్యర్‌ పెన్షన్‌ కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. బీడీఎల్‌ కార్మికులు హయ్యర్‌ పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆప్షన్‌ ఇచ్చి అమలు చేయాలనీ, సాంకేతిక కారణాలను చూపి హయ్యర్‌ పెన్షన్‌ను నిరాకరించడం అన్యాయమని అన్నారు. మురళి, టి.సత్తయ్య మాట్లాడుతూ.. హయ్యర్‌ పెన్షన్‌ కోసం హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని కార్మిక సంఘాలు ఐక్యంగా సమీకరించాలనీ, కార్మికులు న్యాయమైన సమస్యపై కలిసి రావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -