-జిల్లా వైద్యాధికారి ధనరాజ్
– బెజ్జంకి, తోటపల్లి ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – బెజ్జంకి
సీజనల్ వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్యధికారి డాక్టర్ ధనరాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్యధికారి డాక్టర్ ధనరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును, వ్యాక్సిన్ ల స్థితిని కోల్డ్ చైన్,ల్యాబ్, ఫార్మసీలను సందర్శించి రికార్డులను పరిశీలించారు.
ప్రతి మంగళవారం,శుక్రవారం డ్రైడే ను తప్పకుండా నిర్వహించాలన్నారు.సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే ను నిర్వహించి కలుషితమైన నీరు త్రాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు,వ్యక్తిగత,పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధుల తీవ్రతను బట్టి వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ ఆనంద్,వైద్యలు డాక్టర్ కృష్ణ తేజ, మాధురి,సిబ్బంది సులోచన,విజయ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES