Tuesday, February 24, 2026
E-PAPER
Homeఖమ్మంపరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి 

పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి 

- Advertisement -

– ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాలి
– పరీక్ష కేంద్రం సీఎస్ సత్యశ్రీధర్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

పరీక్షలు సమయంలో ఇన్విజిలేటర్ లు ( పరీక్షల పర్యవేక్షకులు) అప్రమత్తం గా వ్యవహరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం సీఎస్( ఛీప్ సూపరింటెండెంట్) చింతా సత్య శ్రీధర్ సూచించారు. బుధవారం నుండి జరగనున్న ఐపీఈ(ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎక్జామ్స్ – 2026 )ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షకులు తో మంగళవారం సమావేశం నిర్వహించారు.

డీఓ(డిపార్ట్మెంట్ ఆఫీసర్) కోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పర్యవేక్షకుల సమావేశంలో వారికి పలు సూచనలు చేశారు. ఇన్విజిలేషన్ అంటే పరీక్షల సమయంలో విద్యార్థులు నియమ నిబంధనలు పాటిస్తూ రాస్తున్నారా లేదా అని పర్యవేక్షించడంమేనని అన్నారు. పరీక్ష హాల్లో విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్ చేయకుండా,ప్రశాంతంగా పరీక్ష రాయడానికి బాధ్యతగా ఉండే విధులనే పర్యవేక్షణను(ఇన్విజిలేషన్ ) అంటారు అన్నారు. పరీక్ష సమయంలో హాల్‌లో ఉండి విద్యార్థులను గమనించే సిబ్బందినే పర్యవేక్షకుడు లేక ఇన్విజిలేటర్ అంటారు అన్నారు.

ప్రశ్నాపత్రాలు పంపిణీ చేయడం, హాజరు నమోదు చేయడం, విద్యార్థులు నిబంధనలు పాటిస్తున్నారా చూడడం, మాల్‌ప్రాక్టీస్ నివారించడం, పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాలు సేకరించడంమే వీరి విధులు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -