పరిశుభ్రమైన తాజా ఆహారాన్ని అందించాలి: ఐటీడీఏ పీఓ డేవిడ్ రాజ్
నవతెలంగాణ – మణుగూరు
వాతావరణం మార్పు వలన మరియు వర్షాలు కురుస్తున్నందున గురుకులంలో చదువుతున్న విద్యార్థినిలకు వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనం అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, కళాశాల పరిసరాలు మరియు వంటగది సామాన్లు నిలువ చేసే స్టోర్ రూమ్ పరిశీలించారు నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారము సమయానుకూలంగా ఆహార పదార్థాలు అందిస్తున్నది లేనిది విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినిలకు చదువుతోపాటు మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని, వర్షాకాలం నడుస్తున్నందున పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
రాత్రిపూట విద్యార్థినిలు ఎవరు బయటకు రాకూడదని సూచించారు. విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరించవచ్చని అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కు ఆదేశించారు. కళాశాలలో జిసిసి కార్యాలయం నుండి నిత్యవసర సరుకులు మరియు బియ్యం సరఫరా కావడం లేదని మరియు విద్యార్థినిలు వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారని తన దృష్టికి రావడంతో వెంటనే జిసిసి వారికి ఫోన్ ద్వారా సంప్రదించి నిత్యవసర వస్తువులు బియ్యం సరఫరా అయ్యేలా చేయడంతో పాటు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విద్యార్థినిలకు దగ్గర్ లో ఉన్న పీహెచ్ డాక్టర్లకు సమాచారం అందించి వెంటనే వైద్య పరీక్షలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం మెనూ ప్రకారం చేసిన వంటకాలను పరిశీలించి విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థినిల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోని వారి చదువుకు భంగం కలగకుండా చూడాలని, వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించాలన్నారు వంట చేసిన తర్వాత విద్యార్థినిలకు సరఫరా చేసేముందు ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు తిన్న తర్వాతనే వారికి వడ్డించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES