ఆర్‌బీఐ హెచ్చరిక
ముంబయి: అనాధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ వేదికల పట్ల అప్రమత్తంగా ఉండాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి పలు సంస్థల జాబితాను విడుదల చేయగా.. తాజాగా మరో ఏడు ప్లాట్‌ఫామ్స్ పేర్లను నిషేధిత జాబితాలో వెల్లడించింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. కొత్తగా ప్రకటించిన వాటిలో స్టార్‌నెట్ ఎఫ్‌ఎక్స్, క్యాప్‌ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్, ట్రైవ్‌్, ఎన్‌ఎక్స్‌జి మార్కెట్స్, నార్డ్ ఎఫ్‌ఎక్స్‌లు ఉన్నాయి. విదేశీ మారక నిర్వహణ చట్టం-1999 (ఫెమా) ప్రకారం జాబితాలోని సంస్థలకు అధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతి లేదు. ఇవి ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ (ఇటిపిలు) ను సైతం నిర్వహించేందుకు వీలు లేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.
ఫారెక్స్ ట్రేడింగ్ వేదికలతో అప్రమత్తం
- Advertisement -
- Advertisement -



